Manchu Vishnu, Ghani: నెగెటివ్ కామెంట్స్ పై మంచు విష్ణు ఫైర్!

సినిమా రిలీజ్ అవుతుందంటే.. సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు చెప్పడం కామనే. ఒక్కోసారి ప్రత్యర్ధులు కూడా విష్ చేస్తుంటారు. టాలీవుడ్ లో అలాంటి స్పోర్టివ్ స్పిరిట్ బాగానే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా సక్సెస్ అవ్వాలని ఆసిస్తూ ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. దీనిపై నెగెటివ్ కామెంట్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. తన విషెస్ ను కూడా నెగెటివ్ కోణంలో చూడడంపై మంచు విష్ణు ఆగ్రహానికి గురయ్యారు.

ఈరోజు ‘గని’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు ట్విట్టర్ లో ‘ఆల్‌ ది బెస్ట్‌ మై బ్రదర్‌ వరుణ్‌ తేజ్‌. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణుపై మెగాబ్రదర్ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్రత్యర్థిగా ప్రకాష్ రాజ్ నిలిచారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను మెగాబ్రదర్ నాగబాబు ప్రోత్సహించారు.

ఆ ప్యానెల్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. నాగబాబు, మంచు విష్ణు మధ్య ‘మా’ ఎన్నికలు గ్యాప్ పెంచాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ బాక్సర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా మంచు విష్ణు కోరుకోలేదని మెగాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘గని’ సినిమా పోవాలని కోరుకున్నావ్ కదా అంటూ మంచు విష్ణు ట్వీట్ పై రియాక్ట్ అవుతున్నారు. ఈ కామెంట్స్ పై మంచు విష్ణు స్పందించారు. తాను మంచి జరగాలని కోరుకుంటే.. నెగెటివ్ గా చూడడం ఏంటని ప్రశ్నించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus