Manchu Vishnu: అతని మాటల్లో నిజముందంటున్న విష్ణు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తుండగా గెలవడం కోసం ఇద్దరూ ఎంతో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మంచు విష్ణు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణం చేపడతానని విష్ణు చెప్పుకొచ్చారు. రవిబాబు మాట్లాడిన మాటల్లో నిజం ఉందని విష్ణు తెలిపారు.

తెలుగువాడినే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని విష్ణు చెప్పుకొచ్చారు. మోదీ గారితో తనకు కూడా బాగానే చనువు ఉందని విష్ణు కామెంట్లు చేశారు. భవనం కొరకు ఎంత మొత్తమైనా ఖర్చు చేస్తానని విష్ణు వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని బై లాస్ ను కొందరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని విష్ణు కామెంట్లు చేశారు. వాటిలో మార్పులు చేస్తామని విష్ణు తెలిపారు. పెళ్లికి కళ్యాణ లక్ష్మీ స్కీమ్ లో భాగంగా 1,16,000 ఇస్తామని విష్ణు చెప్పుకొచ్చారు.

అర్హులైన వ్యక్తుల పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందేలా చూస్తామని విష్ణు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్న సభ్యులకు అవకాశాలు కల్పించడం తన ప్రథమ ప్రాధాన్యత అని విష్ణు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలు తీరే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం ఉంటుందని విష్ణు పేర్కొన్నారు. పెద్దల అంగీకారాన్ని బట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనాన్ని నిర్మిస్తానని విష్ణు చెప్పుకొచ్చారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus