Manchu Vishnu: ప్రకాష్ రాజ్ కు విష్ణు భారీ షాకిస్తారా?

హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ విజయం సాధించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల సమయం ఉండగా కొన్నిరోజుల క్రితం వరకు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అందరూ భావించారు. అయితే చాలామంది నటులు, దర్శకులు బహిరంగంగా విష్ణుకు మద్దతు ప్రకటించడంతో పాటు విష్ణుకు ఓటేయడానికి అవసరమైన కారణాల గురించి చెప్పుకొచ్చారు. రాజీవ్ కనకాల, రవిబాబు, సీవీఎల్ నరసింహారావు, బాలకృష్ణ, కృష్ణంరాజు విష్ణుకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

విష్ణు చెప్పిన విధంగానే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారి అంగీకరించారు. ఈ ఎన్నికల్లో గరిష్టంగా 500 ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉండగా ఎవరు గెలిచినా మెజారిటీ స్వల్పంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. రోజురోజుకు విష్ణుకు మద్దతు పెరుగుతుండటంతో ప్రకాష్ రాజ్ కు విష్ణు భారీ షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తుండటం అతనికి ప్లస్ అవుతోంది.

ఒక్కో సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే ప్రకాష్ రాజ్ ఆ మొత్తాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగు పడుతుందని నాగబాబు పేర్కొన్నారు. ‘మా’ సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus