Manchu Vishnu: జిన్నా మూవీలో మంచి విష్ణు కూతుర్ల పాత్ర ఏంటంటే..!

మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ఈ దీపావళి కి జిన్నా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మధ్య కాలంలో మంచు విష్ణు సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. అయితే ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినిమాలు చేసిన ప్రతిసారీ మంచు విష్ణు హిట్లు అందుకున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం… వంటి చిత్రాలు అన్నీ సక్సెస్ సాధించాయి అంటే ఎంటర్టైన్మెంట్ కారణం అని చెప్పాలి.

ఇప్పుడు రాబోతున్న జిన్నా లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అని చిత్ర బృందం చెబుతుంది. ఇషాన్ సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను గ్యాంగ్స్టర్ గంగరాజు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. దానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా.. జిన్నా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మంచు విష్ణు స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. జిన్నా చిత్రం ద్వారా తన కూతుర్లు ఆరియానా – విరియానా లు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్టు స్పష్టం చేశాడు.

ఆల్రెడీ వారి పేర్ల పై తన సొంత బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్న విష్ణు.. జిన్నా చిత్రంలో మాత్రం వీరితో ఓ పాట కూడా పాడించాడట. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించినట్టు కూడా తెలిపాడు. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు విష్ణు చెప్పుకొచ్చాడు. అనంతరం తన తండ్రి మోహన్ బాబులో తనకి నచ్చని క్వాలిటీ ఏదైనా ఉంటే అది ఆయన కోపమని మంచు విష్ణు తెలిపాడు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus