Manchu Vishnu: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో విష్ణు మూవీ.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలకు క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూలు వస్తున్నా సినిమాలు కమర్షియల్ గా ఆశించిన రేంజ్ లో రిజల్ట్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జిన్నా సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని విష్ణు భావించగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు తర్వాత సినిమాకు ప్రభుదేవా దర్శకునిగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుదేవా తన సినీ కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలను తెరకెక్కించారు. మంచు విష్ణుతో కూడా ప్రభుదేవా రీమేక్ సినిమాను తెరకెక్కిస్తారా లేక స్ట్రెయిట్ సినిమాను తెరకెక్కిస్తారా అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలోని ఒక పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

విష్ణు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన వెలువడుతుందో లేదో చూడాల్సి ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా విష్ణు సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నటుడిగా విష్ణు మార్కెట్ సినిమాసినిమాకు తగ్గుతోంది. మంచు కుటుంబంపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగిటివిటీ కూడా ఈ సినిమాల ఫలితాలకు కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటుడిగా విష్ణు తన రేంజ్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు.

తర్వాత సినిమాలు అయినా విష్ణు కోరుకున్న సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాలి. రాబోయే రోజుల్లో నిర్మాతగా కూడా యాక్టివ్ కావాలని విష్ణు అనుకుంటున్నారు. విష్ణు తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాలను సొంత బ్యానర్ లోనే తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన లేదని విష్ణు చెబుతున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus