టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా న్యూజిలాండ్ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా గురించి ఇప్పటికి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు.
ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే చాలామంది ఆయనని ఫన్నీ ప్రశ్నలు అడిగారని అయితే ఎక్కువ శాతం మంది కన్నప్ప సినిమా మైథలాజికల్ మూవీ అంటూ నన్ను ప్రశ్నించారు. ఈ విషయం నాకు కాస్త ఇబ్బందికరంగా మారిందని విష్ణు తెలిపారు. ఈ విషయం గురించి ఏదో ఒక వీడియో ద్వారా తెలియజేస్తూ కన్నప్ప సినిమా మైథలాజికల్ సినిమా కాదు.
మైథలాజికల్ అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారంటే.. ఆ కథ నిజం కాకుండా, కల్పితం అయితే మైథలాజికల్ అని ఉపయోగిస్తారు. కానీ ఈ కన్నప్ప సినిమా మైథలాజికల్ మూవీ కాదు. ఇది మన హిస్టరీ. శ్రీకాళహస్తి గుడికి సంబంధించిన హిస్టరీ అని తెలిపారు. ఎక్కడో నాసా వాళ్ళు మన రామసేతు గురించి మాట్లాడినప్పుడు మనం రామాయణం గురించి మాట్లాడతాము. అలాగే ద్వారక గురించి కూడా. మన సమస్య ఏంటంటే..
ఇతర దేశాల వారు తమ కల్చర్ అండ్ హిస్టరీని గట్టిగా నమ్ముతారు. కానీ మనం మాత్రం మన చరిత్రను నమ్మడం లేదు అని ఈయన తెలిపారు. ఎన్నో వేల సంవత్సరాల క్రిందట శ్రీకాళహస్తి గుడిలోని లింగం కథ మా కన్నప్ప. ఇది మన చరిత్ర. మైథలాజికల్ మూవీ కాదంటూ విష్ణు (Manchu Vishnu) చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!