మంచు విష్ణు… ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ క్రమంలో కొన్ని హిట్లైతే అందుకున్నాడు.. కానీ విష్ణు మంచి నటుడు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. ఎదో ‘ఢీ’ సినిమాలో మాత్రం కొంచెం ఓకే అనిపించాడు. ఇక ఇటీవల ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించాడు. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోని ఒక అంశాన్ని తీసుకుని ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక మరోపక్క ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
ఇప్పటి ప్రేక్షకులకి ఆ క్లాసిక్ చేరువయ్యేలా కొన్ని మార్పులు చేసి రూపొందించనున్నట్టు కూడా తెలిపారు. ఈ చిత్రాన్ని మొదట తనికెళ్ళ భరణి డైరెక్షన్ లో తెరకెక్కించాలి అని అనుకున్నారట. ఈ విషయాన్ని మంచు విష్ణు నే చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ… “ఈ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ స్తాయిలో రూపొందించాలి అన్నది నా కోరిక. అయితే కొందరి దర్శకుల్ని సంప్రదిస్తే 95 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుంది. అందులో 30 శాతం పారితోషికం కావాలని చెప్పారు. వాళ్లకి ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేదని అర్థమైంది. 95 కోట్లు అవసరమా అనిపించింది. నేను 60 కోట్లకు ఫిక్స్ అయ్యాను. నేను ఇంత పెడుతున్నాను అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని కామెంట్ చేసే వాళ్లు కూడా వున్నారు. వారికి నేను ఒక్కటే చెప్తున్నాను… నేను కట్టే ఐటీ రిటర్న్స్ చూసి… వాళ్లే షాక్ అవుతుంటారు. మీరు ఇంత తక్కువ కడుతున్నారు ఏంటి అని. నా దగ్గర అంత డబ్బు లేదని వాళ్లకి కూడా తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!