Manchu Vishnu: మా ఎన్నికల విషయంలో మంచు విష్ణు కీలక నిర్ణయం!

తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. సి. కళ్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో దిల్ రాజు ప్యానల్లోని సభ్యులు కీలక పదవులు స్వీకరించారు. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగి 24 గంటలు గడవక ముందే ‘మా’ అసోసియేషన్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

నెక్స్ట్ ‘మా’ ఎన్నికల్లో ఆయన పోటీ చేయరట. వచ్చే మే లేదా జూన్ నెలలో ‘మా’ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ లోపు ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని విష్ణు డిసైడ్ అయినట్లు సమాచారం. ‘మా’ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు.. తాను ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా 2021 ‘మా’ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా సంచలనం సృష్టించాయి అని చెప్పాలి.

ప్రకాష్ రాజ్- మంచు విష్ణు (Manchu Vishnu) .. ప్యానల్స్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. ‘మా’ ఎన్నికల టైంలో చోటు చేసుకున్న సందర్భాల పై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలుసు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా ముగిసాయి. ఎటువంటి మాటల యుద్ధాలు జరగలేదు. ఈ క్రమంలో మంచు విష్ణు తీసుకున్న డెసిషన్ ఓ రకంగా అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus