తండ్రి హిట్ సినిమా రీమేక్ లో మంచు విష్ణు..!

సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం డైలాగ్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో మరిచిపోలేని హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్ బాబు మాట్లాడుతూ ‘తమిళంలో వచ్చిన ‘ఎనకు వేలై కడిచాచ్చి’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని  రూపొందించాం.

అల్లుడు గారు విడుదలైన తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. 25 వారాల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం . ఈ రీమేక్ లో మంచు విష్ణు నటిస్తాడ’న్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు తో పాటు పరుచూరి గోపాల కృష్ణ, బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus