మంచు కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’(Kannappa). గత కొన్ని ఏళ్లుగా ఈ సినిమా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో విడుదల, అదిగో రిలీజ్ అంటూ చెబుతున్నా సినిమా రావడం లేదు. అయితే ఈసారి ప్రకటించిన ఏప్రిల్ 25 పక్కా అని, సినిమాను ప్రచారం చేస్తూ వస్తున్నారు. జోరు చూశాక ‘కన్నప్ప’ రాక పక్కా అని అనుకున్నారంతా. అయితే సినిమా రిలీజ్‌కి ఇంకా సుమారు నెల ఉంది అనగా వాయిదా వేసేశారు.
అవును, ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మరోసారి మంచు విష్ణు (Manchu Vishnu) తన సినిమా ప్రచారాన్ని మళ్లీ మొదటి నుండి చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సినిమా వాయిదా పడిన విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశాడు. ‘కన్నప్ప’ జీవిత ప్రయాణం అద్భుతమైనది. అత్యున్నత ప్రమాణాలున్న సినిమాటిక్ అనుభూతితో సినిమాను అందించడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం అని నోట్‌లో రాశాడు.
మేం అనుకున్నట్లుగా అద్భుతమైన సినిమాను మీకు చూపించడానికి మరికొన్ని వారాల సమయం అవసరం. కీలక ఎపిసోడ్స్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా విడుదల ఆలస్యం కానుంది. సినిమా కోసం మీరెంత నిరీక్షిస్తున్నారో అర్థం చేసుకోగలం. ఆలస్యమవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ సహనానికి, సహకారానికి ధన్యవాదాలు. మా బృందం పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తాం అని మంచు విష్ణు చెప్పాడు.
ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), (Mohanlal), కాజల్ (Kajal Aggarwal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) అతిథి పాత్రల్లో నటించగా.. ప్రీతి ముకుందన్, మోహన్‌బాబు (Mohan Babu) , శరత్ కుమార్ (Sarathkumar), ముకేశ్ రుషి, రఘుబాబు (Raghu Babu) , బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాకు విష్ణునే కథ, స్క్రీన్‌ప్లే అందించడం గమనార్హం.\