Mangalavaaram: ‘మంగళవారం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందిన మరో సినిమా ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాపై చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది.

హైప్ కూడా ఓ రేంజ్లో ఉండటంతో.. బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 3.40 cr
సీడెడ్ 2.20 cr
ఆంధ్ర(టోటల్) 4.20 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 9.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 12.00 cr

‘మంగళవారం’ (Mangalavaaram) చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాపై మంచి బజ్ ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరోపక్క వరల్డ్ కప్ అలాగే ‘బిగ్ బాస్ 7’ వల్ల జనాలు థియేటర్ కి రావడం లేదు. అదొక్కటే చిత్ర బృందాన్ని టెన్షన్ పెట్టే న్యూస్ అని చెప్పాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus