Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ ఫిక్స్‌… ఎప్పటినుండి స్ట్రీమింగ్‌ అంటే?

టాలీవుడ్‌లో కొత్త తరహా సినిమాలకు ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. అలా వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. అలా ఇటీవల వచ్చిన అలాంటి సినిమాల్లో ‘మంగళవారం’ ఒకటి. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఓటీటీ రిలీజ్‌. అవును ఓటీటీలోకి ‘మంగళవారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మంగళవారం’. అజయ్‌ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్‌ చేస్తున్నారని సమాచారం.

హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ఈ సినిమా స్ట్రీమ్‌ అవుతుంది అని అంటున్నారు. హిందీ వెర్షన్‌ సంగతి త్వరలో తేలనుంది. త్వరలోనే స్ట్రీమింగ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. నవంబర్ 17న ‘మంగళవారం’ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి వచ్చే వారం ఓటీటీలో వస్తుంది అని చెబుతున్నారు. త్వరలోనే భారీ స్థాయిలో సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తారని టాక్‌. ‘మంగళవారం’ సినిమాలో థ్రిల్లర్, హారర్ ఎలిమేంట్స్‌ను మిక్స్‌ చేసి అదిరిపోయే సినిమా చేశారు అజయ్‌ భూపతి.

ఈ మూవీ థియేటర్లలో మంచి హిట్‌ను అందుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు అజయ్ భూపతి. ఆ తర్వాత చేసిన సినిమా సరైన ఫలితం అందుకోలేదు. మూడో సినిమాగా చేసిన ‘మంగళవారం’ మంచి విజయం అందుకుంది. పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్, నందితా శ్వేత, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమాలో (Mangalavaaram) ప్రియదర్శి క్యారెక్టర్ సర్‌ప్రైజ్‌గా నిలిచింది. కామెడీ పాత్రలు చేస్తూ వచ్చిన దర్శి ‘మంగళవారం’ సినిమాతో భయపెట్టాడు. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్‌కు ‘మంగళవారం’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. మరి సెకండ్‌ ఆపర్చ్యునిటీని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus