ఆర్. ఎక్స్.100 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అజయ్ భూపతి. ఆ సినిమా మేజర్ క్రెడిట్ అంతా హీరోయిన్ పాయల్ ఖాతాలో అలాగే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అకౌంట్ లో పడిపోయింది. అయితే ఆ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంటుంది. అంత తక్కువగా బడ్జెట్ లో అంత క్వాలిటీగా సినిమాని రూపొందించడం అంటే మాటలు కాదు. అందుకే అజయ్ భూపతి రెండో సినిమా మహాసముద్రం కి ఎక్కువ బడ్జెట్ పెట్టే నిర్మాత దొరికాడు.
అయితే ఆ సినిమా ఆడలేదు. కథ కొత్తగా ఉన్నా కథనం స్లోగా సాగడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టడానికి మంగళవారం అనే సినిమా చేశాడు. ఆల్రెడీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ కూడా వదిలారు. రెండు నిమిషాల 58 సెకన్ల నిడివి కలిగిన ఈ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పాలి. ప్రతి మంగళవారం ఒక ఊరిలో ఎవరోఒకరు ఊహించని విధంగా చనిపోవడం చూపించారు.
అది అమ్మవారు పాయల్ ను ఆవహించే బలి తీసుకుంటుందనట్టు ట్రైలర్ లో చూపించారు. పాయల్ మార్క్ గ్లామర్ , ఇంటిమెట్ సన్నివేశాలు ట్రైలర్ లో ఉన్నాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. అజయ్ భూపతి మరోసారి తన మార్క్ చూపించాడు అనే భరోసా ఈ ట్రైలర్ (Mangalavaram) కలిగించింది.