కమల్‌ హాసన్‌ కోసం మణిరత్నం క్రేజీ కాన్సెప్ట్‌.. అదిరిపోయిందంతే..?

పాన్‌ ఇండియా సినిమా.. అంటూ నేటి తరం డైరక్టర్లు, హీరోలు, సినిమా జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ.. ఎప్పుడో సుమారు 35 ఏళ్ల క్రితమే ‘నాయకుడు’ పేరుతో అలాంటి సినిమా ఒకటి వచ్చింది. కమల్‌ హాసన్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తిరిగి ఈ ఇద్దరూ కలవబోతున్నారు. కమల్‌హాసన్‌ 234వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది.

సినిమా అనౌన్స్‌ చేసిన తొలి రోజుల్లో ఈ సినిమా కథ చరిత్ర నుండి తీసుకుంటున్నారు అన్నారు. అలాగే ఓ నవల ఆధారంగా రూపొందుతోంది అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్‌ సోషల్ మెసేజ్ అని, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారసులు ఎలా ఉండాలి? అనే అంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం చెబుతున్నారు. చనిపోయిన మనిషి బతికి వస్తే? అనే క్రేజీ పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుందట.

ఇక ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ‘చీకటి రాజ్యం’ సినిమాలో చివరిగా వీరిద్దరూ కలసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇదే కలసి నటించడం. అయితే ఈ వార్త పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్‌ 28న సినిమా విడుదలయ్యాక.. ఈ సినిమా పనులు వేగవంతం చేస్తారట. మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయి.

ఇక ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తారు. త్వరలో భారీ ఈవెంట్‌లో సినిమా వివరాలను వెల్లడిస్తారని టాక్. ‘విక్రమ్‌’ సినిమా విజయం తర్వాత కమల్‌హాసన్‌ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. ఆగిపోయిన ‘ఇండియన్‌ 2’ సినిమాను తిరిగి ప్రారంభించారు. ఆ సినిఆ వెంటనే మణిరత్నం సినిమా ఉంటుంది అంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus