త్రిష.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సారీ.. సారీ ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు దాటినా ఇంకా టాప్ హీరోయిన్ గా కొనసాగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో త్రిష కూడా ఉండటం.. కేవలం ఆమెకి ఉన్న క్రేజ్ వల్లే అని చెప్పాలి. ఇప్పటికీ ఆమె ఖాతాలో మంచి సినిమాలు పడుతున్నాయి. ’96’ ‘పెట్ట’ వంటి క్రేజీ సినిమాల్లో త్రిష నటించింది.
ఇక ‘పీఎస్-1’ ఈమె (Trisha) ఎంత చక్కగా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుందవి పాత్రలో తన నటనతో పాటు ఆమె లుక్స్ తో కూడా అమితంగా ఆకట్టుకుంది. తమిళంలో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ నటించిన ‘లియో’ మూవీలో కూడా ఈమె నటిస్తోంది. అలాగే ‘పీఎస్-2’ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ‘పీఎస్-1’ లో కంప్లీట్ గా కార్తీ, త్రిష పాత్రలే హైలెట్ గా నిలిచాయి.
ఐశ్వర్య రాయ్ కూడా కీలక పాత్రలో కనిపించినా ఆమె ప్రమోషన్లకు హాజరు కావడం లేదు. దీంతో దర్శకుడు మణిరత్నం ఫుల్ గా త్రిష పైనే ఫోకస్ పెట్టాడు. విక్రమ్, కార్తీ, జయం రవి వంటి వారు స్పెషల్ ఇంటర్వ్యూలు వంటివి ఇస్తుంటే.. త్రిషని మాత్రం టూర్లకు కూడా తిప్పుతూ ‘పీఎస్2’ పై హైప్ ఏర్పడేలా చేస్తున్నాడు మణిరత్నం. ‘పీఎస్-1’ ఎంత పెద్ద హిట్టయినా ‘పీఎస్2’ పై హైప్ ఏర్పడలేదు అన్నది వాస్తవం. మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో ఏప్రిల్ 28న తెలుస్తుంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!