ఒకప్పుడు నాగార్జున సరసన ‘మన్మథుడు’ సినిమాలో మహేశ్వరిగా అమాయకమైన లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన అన్షు గుర్తుందా? ఇప్పుడు ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. బ్యాక్‌లెస్ డ్రెస్‌లో హాట్ పోజులిస్తూ దిగిన ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మన్మథుడు’ (2002) తర్వాత అన్షు ‘రాఘవేంద్ర’, ‘జై’ (తమిళ్) లాంటి కొన్ని సినిమాల్లోనే కనిపించింది.
ఆ తర్వాత కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఇప్పుడు ఆమెకు 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, ఈ మధ్యే సందీప్ కిషన్ నటించిన ‘మజాకా’ (2025) సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చేతిలో కొత్త సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అన్షు, ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్‌ను బయటపెడుతూ అందరికీ షాక్ ఇస్తోంది. ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె, అక్కడ బికినీలు, స్టైలిష్ డ్రెస్సులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ వయసులో కూడా ఆమె ఫిట్‌నెస్, స్టైల్ చూసి కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకోవాల్సిందే అంటున్నారు నెటిజన్లు.