‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నాగార్జున ఎన్నో విభిన్న కథా చిత్రాలని నిర్మించి సూపర్ హిట్లు అందుకున్నారు. అందులో కొన్ని సినిమాల్లో ఆయనే హీరోగా నటించడం మరో విశేషం. అందులో `మన్మథుడు` సినిమా కూడా ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెండు షేడ్స్ కలిగిన పాత్రని నాగార్జున పోషించారు.ఓ పాత్రలో లవర్ బాయ్ గా మరో పాత్రలో అమ్మాయిల్ని అసహ్యించుకునే పాత్రలో నటించి ప్రేక్షకులకి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు నాగ్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, మాటలు హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికీ ‘మన్మథుడు’ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది అంటే రిమోట్లు పక్కన పెట్టేసి మరీ ఈ చిత్రాన్ని చూస్తుంటారు ప్రేక్షకులు. ఈరోజుతో ఈ చితం రిలీజ్ అయ్యి 19ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.82 cr |
సీడెడ్ | 2.08 cr |
ఉత్తరాంధ్ర | 1.51 cr |
ఈస్ట్ | 1.23 cr |
వెస్ట్ | 0.87 cr |
గుంటూరు | 1.07 cr |
కృష్ణా | 0.79 cr |
నెల్లూరు | 0.46 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.72 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 13.55 cr |
‘మన్మథుడు’ చిత్రానికి ఆ టైంలో రూ.8 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.13.55 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. అంటే బయ్యర్లకి రూ.5.55 కోట్ల వరకు లాభాలు దక్కాయన్న మాట.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!