Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Reviews » Mansion 24 Review in Telugu: మాన్షన్ 24 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mansion 24 Review in Telugu: మాన్షన్ 24 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • October 17, 2023 / 03:02 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Mansion 24 Review in Telugu: మాన్షన్ 24 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, (Heroine)
  • సత్యరాజ్‌, రావు రమేశ్‌, శ్రీమాన్‌, అవికా గోర్‌, మానస్‌ నాగులపల్లి, రాజీవ్‌ కనకాల, అభినయ, నందు, బిందు మాధవి, తులసి, అర్చనా జాయిస్‌, అమర్‌ దీప్‌ చౌదరి, 'బాహుబలి' (కాలకేయ) ప్రభాకర్‌, జయప్రకాశ్‌, సూర్య, విద్యుల్లేఖ తదితరులు (Cast)
  • ఓంకార్‌ (Director)
  • ఓంకార్‌, అశ్విన్‌ బాబు, కళ్యాణ్‌ చక్రవర్తి (Producer)
  • వికాస్‌ బాడిస (Music)
  • బి. రాజశేఖర్‌ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 17, 2023

గత వారం అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మినిమమ్ బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ వారం అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా చాలా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘మాన్షన్ 24′ ఒకటి. హర్రర్ సినిమాలు తీయడంలో ఓంకార్ ఆరితేరిన వ్యక్తి.’రాజుగారి గది’ సీక్వెల్స్ తో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు.

అందులోనూ ‘మాన్షన్ 24’ టీజర్, ట్రైలర్లు ఆసక్తిని కలిగించాయి. అంతేకాకుండా ఇందులో సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి స్టార్లు ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్ పై ఆసక్తి పెరగడానికి అది కూడా ఓ కారణమని చెప్పవచ్చు. మరి ‘మాన్షన్ 24’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ : అమృత (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఆమె తండ్రి కాళిదాస్‌ (సత్యరాజ్‌) పురాతన వస్తు శాఖలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఇతను తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో పారిపోయాడని కథనాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు కాళిదాసుపై దేశద్రోహి కేసు కూడా నమోదవుతుంది.దీంతో అతని ఫ్యామిలీ పై ప్రజలు, మీడియా మానసికంగా దాడి చేయడం మొదలుపెడుతుంది. అమృత తల్లి(తులసి) కూడా హాస్పిటల్ పాలవుతుంది. అయితే తన తండ్రి దేశద్రోహి కాదని,నేను ఓ నిజాయతీపరుడైన కాళిదాసు కూతుర్ని అంటూ అమృత మీడియాని ఫేస్ చేస్తుంది.

అలాగే తన తండ్రి నిర్దోషి అని నిరూపించాలని భావించి… అతను చివరిగా వెళ్లిన.. ఊరికి ఉత్తరాన, ఓ కొండపై ఉన్న మ్యాన్షన్‌కు వెళ్తుంది. అక్కడ ఆమెకి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అవి ఏంటి? ఆ మాన్షన్ లో దెయ్యాలు ఉన్నాయా… అవే అమృత తండ్రి కాళిదాసుని చంపేశాయా? ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలి అంటే ‘మాన్షన్ 24’ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా బాగా చేసింది. కాకపోతే గతంలో ఆమె చేసిన ‘నాంది’ కి చాలా సిమిలర్ గా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో వరలక్ష్మీ ఇమేజ్ కి తగ్గ సీన్లు పడ్డాయి. రావు రమేశ్‌ మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించారు అని చెప్పొచ్చు. సత్యరాజ్‌ ఈ సిరీస్ లో నటించారు అనే కంటే కూడా కనిపించారు అని చెప్పాలేమో. ఎందుకంటే ఆయన పాత్ర నిడివి అంత తక్కువ కాబట్టి.

కానీ కథ మొత్తం ఇతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తులసి పాత్ర కూడా అంతే.! అభినయ ,రాజీవ్‌ కనకాల… పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవికా గోర్‌ , బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌ నాగులపల్లి,’కెజియఫ్‌’లో రాఖీభాయ్ తల్లిగా చేసిన అర్చనా జాయిస్‌…ఉన్నంతలో బాగానే నటించారు అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘రాజుగారి గది’ సీక్వెల్స్ విషయంలో కామెడీ కూడా ప్లస్ అయ్యింది. అయితే ఈ ‘మాన్షన్ 24’ విషయంలో కామెడీని పక్కన పెట్టేశాడు దర్శకుడు ఓంకార్. ఎప్పుడైతే తన బలాన్ని పక్కన పెట్టేశాడో… అప్పుడు అతనికి ఇది ఇంకా ఛాలెంజింగ్ గా మారింది అని చెప్పొచ్చు. అయినప్పటికీ ‘మాన్షన్ 24’ ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కాకపోతే హర్రర్ సినిమాల్లో ట్విస్ట్ లు కూడా కీలకంగా ఉంటాయి.

‘ఇందులో అలాంటివి లేవు. ఎంగేజింగ్ గా కథని చెప్పాలనుకున్నాడు.థ్రిల్లింగ్ అనిపించే అంశాలు లేవు. ఇక మరో విషయం ఏంటి అంటే.. ఈ సిరీస్ లో పాటలు కూడా ఉండటం. అది సీరియస్ మోడ్ ను పక్కకు డైవర్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.అదొక మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఓకే.

విశ్లేషణ : మొత్తంగా ఈ ‘మాన్షన్ 24’ కొన్ని చోట్ల భయపెట్టింది. పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఎంగేజ్ చేసింది. క్లైమాక్స్ కనుక ఇంకాస్త బాగా డిజైన్ చేసుంటే.. తప్పకుండా దీని స్థాయి మరో రేంజ్లో ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైనా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 6 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mansion 24
  • #Ohmkar
  • #Varalaxmi Sarathkumar

Reviews

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్ లాంచ్!

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్ లాంచ్!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

Tamannaah: తమన్నా డిమాండ్ ఇంకా తగ్గలేదుగా..!

Tamannaah: తమన్నా డిమాండ్ ఇంకా తగ్గలేదుగా..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

Sunny Deol: 500 కోట్ల నుంచి ఓటీటీ ప్రాజెక్ట్ కు వచ్చిన హీరో!

Sunny Deol: 500 కోట్ల నుంచి ఓటీటీ ప్రాజెక్ట్ కు వచ్చిన హీరో!

trending news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

13 hours ago
ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

19 hours ago
సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

20 hours ago
OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

21 hours ago

latest news

అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

15 hours ago
The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

15 hours ago
OG Movie: ‘ఓజి’ షూటింగ్.. పవన్ మళ్ళీ హ్యాండిచ్చాడా?

OG Movie: ‘ఓజి’ షూటింగ్.. పవన్ మళ్ళీ హ్యాండిచ్చాడా?

17 hours ago
Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

19 hours ago
‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version