ఓటీటీలో మే 20న ఏం జరగనుందో తెలుసా?

ఈ శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలేవీ రావడం లేదని బాధపడేవారికి ఓటీటీలు గుడ్‌ న్యూస్‌ చెప్పాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు 20వ తేదీన స్ట్రీమ్‌ అవ్వబోతున్నాయి. ఈ డేట్‌కి ఉన్న ప్రత్యేక ఏంటో తెలియదు కానీ.. ఇన్నేసి సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి. సమ్మర్‌ బొనాంజా అనుకోవాలో, లేక స్పెషల్‌ ఆఫర్‌ అనుకోవాలో కానీ.. ఒక్కో ఓటీటీలో ఒక్కో కొత్త సినిమా సందడి చేయబోతోంది. అవేంటో ఓసారి చూద్దామా.

సినిమా జనాలు ఇటీవల కాలంలో థియేటర్లలో చూసి బాగా ఎంజాయ్‌ చేసిన చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌, తారక్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సుమారు రూ. 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 20వ తేదీన ‘జీ5’లో విడుదల చేస్తున్నారు. అయితే దీని కోసం కొంతమొత్తం చెల్లించాలి అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘ఆచార్య’.

మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో కలసి నటించిన సినిమా ఇది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా విఫలమైంది. మరిప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. హాట్‌ స్టార్‌లో కూడా ఈ నెల 20న ఓ సూపర్‌ స్టార్‌ సినిమా రాబోతోంది. మోహన్‌లాల్‌ నటించిన ‘12th మ్యాన్‌’ సినిమాను ఆ రోజే తీసుకొస్తున్నారు. జీతూ జోసెఫ్‌ రూపొందించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.

మిస్టరీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం మోహన్‌లాల్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ను మరోసారి చూపిస్తుందని అంటున్నారు. ఇవి కాకుండా షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ కూడా 20నే స్ట్రీమ్‌ అవ్వబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగు ‘జెర్సీ’తో పోలిస్తే సమానంగా ఉందని చెప్పిన హిందీ ‘జెర్సీ’… ‘కేజీయఫ్‌ 2’ దెబ్బకి థియేటర్లలో కుదేలైపోయింది. మరి ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటు శ్రీవిష్ణు నటించి ‘భళా తందనాన’ కూడా శుక్రవారమే వస్తోంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు థియేటర్లలో సరైన స్పందన రాలేదు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus