టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ (Jani Master) పై పోక్సో కేసు నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. ఈ కేసు నుంచి జానీ మాస్టర్ బయటపడటం సులువు కాదని ఈ కేసులో బెయిల్ కూడా రాదని ప్రచారం జరుగుతోంది. గోవాలోని లాడ్జిలో పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ పై కేసు నమోదైంది.
Jani Master Controversy
బాధితురాలు ఫిర్యాదులో 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యారని 2019లో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ గా చేరానని ఆ లేడీ కొరియోగ్రాఫర్ పేర్కొన్నారు. 2019లో ముంబైలో ఒక మూవీ షూటింగ్ కొరకు ముంబైకు వెళ్లగా అక్కడ హోటల్ పై నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఆ తర్వాత కూడా పలుమార్లు తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెబుతున్నారు.
మరోవైపు జానీ మాస్టర్ కొంతమంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్ మాస్టర్లకు సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దాదాపుగా 90 మందిని జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా జానీ మాస్టర్ పై ఈ తరహా ఆరోపణలు వినిపించాయి.
జానీ మాస్టర్ కెరీర్ పై మాత్రం ఈ కేసు ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. జానీ మాస్టర్ వయస్సు 42 సంవత్సరాలు కాగా రాజకీయ ప్రముఖులు సైతం జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం గమనార్హం. కొంతమంది స్టార్ హీరోలు ఇకపై జానీ మాస్టర్ కు ఆఫర్లు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.