తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా మరాఠీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో సిద్దార్థ్ చందేకర్ ఒకరు. తాజాగా ఈ ప్రముఖ నటుడు తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధ పడుతుండటంతో తన తల్లి సంతోషాన్ని కోరుకున్న సిద్దార్థ్ చందేకర్ తల్లి సీమా చందేకర్ కు రెండో పెళ్లి చేయడంతో పాటు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
సిద్దార్థ్ చందేకర్ (Siddarth Chandekar) తన పోస్ట్ లో హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మా అని చెప్పుకొచ్చారు. నీ పిల్లలతో పాటు నీ లైఫ్ ఇంకా మిగిలే ఉందని నీకు అందమైన, స్వతంత్రమైన ప్రపంచం ఉందని సిద్దార్థ్ పేర్కొన్నారు. అమ్మ మా కోసం చాలా త్యాగం చేసిందని ఇప్పుడు అమ్మ తన గురించి, కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమందని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. అమ్మ తీసుకునే ప్రతి నిర్ణయంలో కొడుకుగా నా సపోర్ట్ ఉంటుందని సిద్దార్థ్ కామెంట్లు చేశారు.
అమ్మ నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించిందని అదే విధంగా నేను కూడా అమ్మ పెళ్లిని గ్రాండ్ గా చేశానని సిదార్థ్ పేర్కొన్నారు. లైఫ్ లో ఎంతగానో సంతోషించే ఈవెంట్లలో పెళ్లి ఒకటని ఐ లవ్ యూ అమ్మా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సిదార్థ్ చందేకర్ కామెంట్లు చేశారు. సిద్దార్థ్ చందేకర్ తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.
జెండా, క్లాస్ మేట్స్, బాల గంధర్వ సినిమాలలో నటించిన సిద్దార్థ్ చందేకర్ పలు షోల ద్వారా, వెబ్ సిరీస్ ల ద్వారా కూడా పాపులారిటీని పెంచుకున్నారు. తల్లిపై తనకు ఉన్న ప్రేమను చూపిస్తూ, తల్లి రెండో పెళ్లి గురించి ప్రస్తావిస్తూ సిద్దార్థ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తల్లిపై సిద్దార్థ్ చందేకర్ స్థాయిలో ప్రేమను చూపించే వాళ్లు అరుదు అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్