బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం అనూహ్యంగా మెరీనా ఎలిమినేట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇంకో వారం ఉంటే రోహిత్ మెరీనా ఇద్దరూ తమ వెడ్డింగ్ డేని బిగ్ బాస్ లో ఘనంగా చేసుకునేవారు. ఈవిషయం మెరీనా బిగ్ బాస్ కి అర్ధమయ్యేలా చెప్పింది కూడా. అయినా కూడా మెరీనా ఓటింగ్ లో లీస్ట్ అయిపోయింది. శ్రీసత్య యాంటీ ఫ్యాన్స్ అందరూ లాస్ట్ రెండు రోజులు మెరీనా రోహిత్ లకి ఓట్ వేశారు. కానీ, మెరీనా సేవ్ అవ్వలేకపోయింది.
నిజానికి అసలు తెరవెనుకు ఏం జరుగుతోంది ? ఎందుకు ఓటింగ్ పోల్స్ ని చూపించడం లేదంటూ బిగ్బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలాంటి అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్ చాలా జరుగుతున్నాయని కంప్లైట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మెరీనా కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఈవారం మొత్తం 9మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో చెక్ టాస్క్ లో రాజ్ కి ఇమ్యూనిటీ లభించింది. ఆ తర్వాత 8మందిలో రేవంత్, ఇనాయ, శ్రీహాన్, కీర్తి వీళ్లు సేఫ్ జోన్ లో ఉన్నారు.
మిగతా నలుగురు అయిన ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్, ఇంకా శ్రీసత్యలు ఓటింగ్ లో వెనకబడ్డారు. అన్ అఫీషియల్ పోల్స్ లో ఎక్కడ చూసినా కూడా శ్రీసత్య లీస్ట్ లో ఉంది. కానీ, అనూహ్యంగా మెరీనా ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మెరీనా గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి వస్తునే ఉంది. ఈవారం కూడా తను వెళ్లిపోతుందేమో అని ముందుగానే ఊహించింది. మరోవైపు ఆదిరెడ్డి, శ్రీసత్య ఇద్దరూ మెరీనా లేదా కీర్తి వెళ్లిపోవచ్చని అనుకున్నారు.
మెరీనా ఈసారి నామినేషన్స్ లోకి రావడానికి కీర్తి కూడా కారణమే. కీర్తి కూడా మెరీనాకి ఓటు వేసింది. దీంతో మెరీనా ఎలిమినేషన్ అప్పుడు కీర్తి ఖచ్చితంగా బాధపడుతుంది. అంతేకాదు, ఈసారి నామినేషన్స్ లో పాయింట్స్ ని హౌస్ మేట్స్ టాస్క్ ల్లో జరిగిన మిస్టేక్స్ నుంచీ తీస్కుంటారు. అలాగే బిగ్ బాస్ కూడా వాళ్లకి ఓపెన్ నామినేషన్స్ పెట్టే అవకాశం ఉంది. ఆదిరెడ్డి, రోహిత్ , మెరీనా, శ్రీసత్య నలుగురులో అఫీషియల్ ఓటింగ్ లో మెరీనా వెనకబడిపోయి ఉండచ్చు.
అలాగే ప్రతి ఎలిమినేషన్ లో కూడా మిస్ట్ కాల్ డేటా కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఈరెండు హాట్ స్టార్ అఫీషియల్ ఓటింగ్స్ గురించి ఎక్కడా కూడా లీక్స్ ఉండవు. అలాగే, బిగ్ బాస్ టీమ్ కూడా ఈ ఓటింగ్ ని పబ్లిక్ చేయదు. అందుకే, లాస్ట్ మినిట్ వరకూ కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సస్పెన్స్ గానే ఉంటుంది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే మెరీనా ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం. అదీ మేటర్.