‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాతో దర్శకుడు మారుతి కొత్త పద్దతికి తెరతీశాడు. ఒక సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తనే అందించి.. దర్శకుడిగా మాత్రం వేరే వాళ్ల పేరు వేస్తుంటాడు. చిన్న సినిమాలకు తన పేరు వాడడం ఇష్టం లేక అలా చేస్తాడో.. లేక ఇతర కమిట్మెంట్స్ వలన చేస్తాడో తెలియదు కానీ అప్పుడప్పుడు తన సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్ గా ఉంటాడు. ఇలా చేసిన కొన్ని సినిమాలు ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి.
డబ్బుల కోసం మారుతి టాకీస్ బ్యానర్ పై క్వాలిటీ లేని సినిమా తీశారనే విమర్శలు వచ్చాయి. అందుకే మారుతి జాగ్రత్త పడుతున్నాడు. ఇలాంటి వ్యవహారాలను పక్కన పెట్టాడు. ఇదిలా ఉండగా.. ‘ప్రతి రోజూ పండగే’ సినిమా తరువాత మారుతికి సరైన హీరో దొరకలేదు. దీంతో గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంతలో కరోనా రావడంతో షూటింగ్ ఆగింది. లాక్ డౌన్ సమయంలో రాసుకున్న కథతో మారుతి ఓ చిన్న సినిమాను మొదలుపెట్టాడు.
యూవీ సంస్థతో కలిసి సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ముప్పై రోజుల్లో ఈ సినిమాను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా ప్రారంభించాడు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా మారుతి పేరు ఉండదట. కథ, మాటలు, స్క్రీన్ ప్లేకి తన పేరు వేసుకొని డైరెక్టర్ గా వేరే ఎవరో పేరు వేసే ఆలోచనలో ఉన్నారట, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని సమాచారం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!