Maruthi, Prabhas: ప్రభాస్ సినిమా.. మారుతి ప్లానింగ్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైలెంట్ గా నిర్వహించారు. ఈ సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పారు కానీ డేట్స్ మాత్రం అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే మారుతి చాలా కాలంగా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ లేకపోయినా.. సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ను నిర్మిస్తున్నారు.

అందులో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రభాస్ లేని సన్నివేశాలను తీసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ప్రభాస్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి నుంచి ఈ సినిమా హారర్ జోనర్ సాగే థ్రిల్లర్ అని అంటున్నారు. అయితే మారుతి రాసుకున్న కథ మాత్రం వేరే అని టాక్. కానీ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్ట్స్ మాత్రం బాగా ఉంటాయని అంటున్నారు.

నిధి అన్వేషణ కూడా ఈ కథలో కీలక భాగమని టాక్. సినిమాలో సగభాగం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసే సెట్ లోనే చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి తారలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఎన్నో ఆశలు పెట్టుకొని మారుతి తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా పెద్ద దెబ్బ కొట్టడంతో.. ప్రభాస్ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలే పాన్ ఇండియా స్టార్ తో ఛాన్స్.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మరొకటి రాదు. ఈ సినిమా గనుక హిట్ అయితే వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus