మారుతి..మాస్టర్ ప్లాన్ అదిరింది!!!

టాలీవుడ్ లో ఎందరో టాప్ డైరెక్టర్స్ ఉన్నారు. అయితే అందులో ఎంతో మంది తమకు నచ్చిన జోనర్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోటు ఉంటారు….ఇక అదే క్రమలో యూత్ ను టార్గెట్ చేస్తూ…మన యువ దర్శకుడు మారుతి చేసిన కొన్ని సినిమాలు మారుతికి ఒక ట్రేడ్ మార్క్ ను అందించాయి….మారుతి సినిమా అంటే చాలు ఎక్కడలేని అంచనాలు పెరిగేలా చేశాయి. అదే క్రమామ్‌లో యువ హీరోలకు వరంగా మారాడు మన ఈ యువ దర్శకుడు.

భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆతరువాత వెనువెంటనే టాప్ హీరో అయిన వెంకీతో మారుతి ‘బాబు బంగారం’ చేసేసాడు’. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బాబు బంగారం’ నిరాశ పరిచింది. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో లేదన్నది వాస్తవం. ఇక ఆ సినిమా తరువాత మారుతి ఏ సినిమా ఎవరితో చేస్తాడు అన్న ఆలోచనలో ‘జీనియస్’ ఫేమ్ హవీష్ హీరోగా మారుతి సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే అదే క్రమంలో అసలు మారుతి ఏమంటున్నాడు అంటే…నవంబర్లో ఓ కొత్త హీరోతో లో బడ్జెట్ సినిమా తీస్తున్నానని.. అలాగే వచ్చే ఏడాది మార్చిలో హీరో నాని లేదా అక్కినేని అఖిల్ తో ఒక సినిమా మొదలవుతుందని అంటున్నాడు…నవంబర్ లో ఒక కొత్త హీరో అంటే హనీష్ ఏమో అన్న గుసగుసలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఏడాది మారుతి ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే…నవంబర్ లో మొదలయ్యే సినిమా మంచి హిట్ కావాలి…అసలే బాబు బంగారం ఫ్లాప్ తో కాస్త నిరాశ పడ్డ మారుతి….మంచి మాస్టర్ ప్లాన్ తో మళ్లీ సూపర్ హిట్ ఇస్తాడు అని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus