Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

‘మిస్టర్ బచ్చన్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నుండి రాబోతున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’కి రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ‘మాస్ జాతర’ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.’సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్. గ్లింప్స్, టీజర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ లభించింది.

Mass Jathara

ఆగస్టు 27న ‘మాస్ జాతర’ రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమా వచ్చే అవకాశం లేదు అని ఇన్సైడ్ టాక్. విషయంలోకి వెళితే.. ‘మాస్ జాతర’ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న యూనియన్ సమ్మె కారణంగా ఆ వర్క్ పెండింగ్లో ఉందట. దీంతో ఆగస్టు 27 నాటికి సినిమా రెడీ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.


మాస్ మహారాజ్ రవితేజ ఏడాదికి కనీసం 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. కానీ వరుస ప్లాపులు కారణంగా ‘మాస్ జాతర’ కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదు అని డిసైడ్ అయ్యాడు. ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అయ్యి ఏడాది దాటినా రవితేజ నుండి మరో సినిమా రాలేదు. మరోపక్క ‘సితార..’ నాగవంశీ నిర్మించే ప్రతి సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాదు’ అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాతో అది నిజమే అని అంతా మరోసారి కామెంట్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక ‘మాస్ జాతర’ వాయిదాకి సంబంధించిన అధికారిక ప్రకటన అలాగే  కొత్త రిలీజ్ డేట్ తో వచ్చే అవకాశం ఉంది.

కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus