Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ఫోటో.. ఏమైంది?

మాస్ మహారాజ్ రవితేజకి (Ravi Teja) సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు అయితే టెన్షన్ కి గురవుతున్నారు. ‘మా రవన్నకి ఏమైంది?’ అంటూ కామెంట్లు పెడుతూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అసలు ఈ ఫోటో ఒరిజినలా? మార్ఫింగా? అనే అయోమయంలో చాలా మంది ఉన్నారు. ఫిల్మీ ఫోకస్ కి అందిన సమాచారం ప్రకారం.. ఆ ఫోటో ఒరిజినల్ కాదు.కానీ దాని సారాంశం నిజమే.

Ravi Teja:

నిన్నటి షూటింగ్ లో నిజంగానే రవితేజ కి యాక్సిడెంట్ అయ్యింది.రవితేజ 75 వ సినిమా షూటింగ్లో భాగంగా ఓ సాంగ్ చిత్రీకరిస్తున్న టైంలో అతని కుడి చేతికి గాయమైంది అని తెలుస్తుంది.దీంతో యూనిట్ సభ్యులు రవితేజని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. ఐసీయూలో రవితేజ చికిత్స పొందుతున్న టైంలో ఓ డాక్టర్ ఈ ఫోటో తీసారట. ఆ తర్వాత అది వైరల్ అయిపోయింది. ఇప్పుడు రవితేజ కండిషన్ బాగానే ఉంది. 4 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని రవితేజకి సూచించారట వైద్య నిపుణులు. సో రవితేజ అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు.

ఈ మధ్యనే ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఐఫా నామినేషన్స్ లో సత్తా చాటిన బాలయ్య మూవీ.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus