భలే కాంబినేషన్.. ఇది నిజమేనా?

  • July 19, 2019 / 06:50 PM IST

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు కాబట్టి.. ఆ తర్వాత నుండీ ఆయనకి వరుస ఆఫర్లు రావడం ఖాయమనుకున్నారంతా..! కానీ ఈ దర్సుకుడికి ఏ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్ వంటి హీరోల దగ్గరికి వెళ్ళినా.. వారు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ మంచి ఛాన్స్ కొట్టాడు ఈ డైరెక్టర్. ఏకంగా మాస్ మహారాజ్ రవితేజ తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘మహాసముద్రం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది.

ఈ చిత్రంలో మరో హీరోగా సిద్దార్థ్ నటించబోతున్నాడట. అప్పట్లో ప్రేమకథా చిత్రాలు చేసి తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. కానీ అది ఎంతోకాలం సాగించలేకపోయాడు. దీంతో ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో తమిళంలోనే సినిమాలు చేస్తూ గడుపుతున్నాడు. ఇప్పుడు చాన్నాళ్ళ తరువాత రవితేజ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు ఈ క్లాస్ హీరో. ఇక వైజాగ్ నగరంలో.. అందులోనూ మాఫియా డ్రాప్ లో సాగే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ‘సమ్మోహనం’ ఫేమ్ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇక సిద్దార్థ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus