అక్కినేని నాగార్జున హీరోగా జ్యోతిక, ఛార్మి హీరోయిన్లుగా స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారుతూ చేసిన చిత్రం ‘మాస్’. హీరో అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2004 వ సంవత్సరం డిసెంబర్ 23న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పటికి నాగార్జున కెరీర్లోనే అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా రికార్డులు సృష్టించింది ‘మాస్’. లారెన్స్ టేకింగ్ నాగార్జున నటన.. రాహుల్ దేవ్ విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం…వంటివి ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి. నేటితో ‘మాస్’ రిలీజ్ అయ్యి 17ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.35 cr |
సీడెడ్ | 4.00 cr |
ఉత్తరాంధ్ర | 2.10 cr |
ఈస్ట్ | 1.35 cr |
వెస్ట్ | 1.10 cr |
గుంటూరు | 1.55 cr |
కృష్ణా | 1.10 cr |
నెల్లూరు | 1.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.55 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.80 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 19.35 cr |
‘మాస్’ చిత్రానికి రూ.12.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.19.35 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే బయ్యర్లకి రూ.7.02 కోట్ల లాభాలు మిగిలాయన్న మాట. అప్పటికి నాగార్జున కెరీర్లో ఇవే హైయెస్ట్ కలెక్షన్లు. అటు తర్వాత నాగార్జున- లారెన్స్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘డాన్’.. ‘మాస్’ కలెక్షన్లను అధిగమించింది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!