నెలరోజుల గ్యాప్ లో మూడు మాస్ సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలకు ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ది వారియర్ సినిమాతో రామ్, రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో రవితేజ, మాచర్ల నియోజకవర్గం సినిమాతో హీరో నితిన్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ది వారియర్ సినిమాకు లింగుస్వామి డైరెక్టర్ కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు శరత్ మండవ మాచర్ల నియోజకవర్గం సినిమాకు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
శరత్ మండవ, రాజశేఖర్ రెడ్డి కొత్త దర్శకులు కాగా ఈ దర్శకులకు భారీ షాకులు తగిలాయనే చెప్పాలి. ఈ మూడు సినిమాలు ఫ్లాప్ కావడానికి కథలో కొత్తదనం లేకపోవడం కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రొటీన్ మాస్ మసాలా కథలను టాలీవుడ్ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఆదరించడం లేదు. మాస్ మసాలా సినిమాలను కూడా కొత్తగా తెరకెక్కిస్తే మాత్రమే ప్రేక్షకాదరణ దక్కుతోంది. స్టార్ హీరోలు ఇకపై రొటీన్ కథలకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలు రామ్, రవితేజ, నితిన్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త దర్శకులు కొత్తదనంతో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తే రొటీన్ కథలతో షాకిస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయంలో ప్రేక్షకులు మారలేదని దర్శకులు మారాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొత్త దర్శకులు తొలి సినిమాతోనే ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే కొత్త సినిమా ఆఫర్లు రావడం కూడా సులువు కాదని చెప్పవచ్చు.