Vijay: విజయ్‌ సినిమా పనులు షురూ చేసిన లోకేశ్‌!

విజయ్‌కి ఓ మాస్‌ సినిమా పడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కోలీవుడ్‌, టాలీవుడ్‌ అని లెక్క లేకుండా రెండు చోట్లా రికార్డు వసూళ్లు సాధిస్తుంది. అయితే ‘బీస్ట్‌’తో అనుకున్న స్థాయిలో వసూళ్లు కానీ, పేరు కానీ సంపాదించ లేకపోయారు. దీంతో మరోసారి ఫుల్‌ మాస్‌ మసాలా సినిమాను తీసుకురావాలని చూస్తున్నారట. దీని కోసం తనకు ‘మాస్టర్’ లాంటి సినిమా ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌కు పని అప్పగించారు. ఈ మేరకు సినిమా పనులు మొదలయ్యయని లోకేశ్‌ చెప్పారు.

#దళపతి67 వర్కింగ్‌ టైటిల్‌తో విజయ్‌ సినిమా పనులు ఇప్పటికే ప్రారంభించాం అని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ఇటీవల తెలిపారు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఎందుకంటే లోకేశ్‌ మాస్‌ మేనరిజమ్స్‌ విజయ్‌ వంట్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ‘మాస్టర్’లో చూశారు. ఇప్పుడు ఫుల్‌ మాస్‌ మసాలా సినిమా అని తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంతేకాదు మాస్‌తో పాటు క్లాస్‌ టచ్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

లోకేశ్‌ దర్శకత్వం వహించిన చిత్రం కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ జూన్‌ 3న విడుదలవ్వనుంది. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక లోకేశ్‌ పూర్తిగా విజయ్‌ సినిమా పనులతో బిజీ అయిపోతాడని అంటున్నారు. మరోవైపు విజయ్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో రూపొంది.. తెలుగులోకి డబ్‌ అయ్యి వస్తుంది. ఆ సినిమా తర్వాతే లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేస్తారని సమాచారం. అంటే వచ్చే సంక్రాంతి తర్వాతే లోకేశ్‌ – విజయ్‌ సినిమా షూటింగ్‌ మొదలవ్వొచ్చు.

ఎందుకంటే విజయ్‌ – వంశీ పైడిపల్లి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇటీవల దిల్‌ రాజు టీమ్‌ ప్రకటించింది. మామూలుగానే లోకేశ్‌ కనగరాజ్‌ చాలా వేగంగా సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తాడు. ఈ లెక్కన వచ్చే సమ్మర్‌లో విజయ్‌ సినిమాను ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఒకవేళ లేదంటే వర్షాకాలంలో వచ్చేయొచ్చు. సో ‘మాస్టర్‌’ కాంబో కోసం అంచనాలు పెంచేసుకోవచ్చు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus