Mathu Vadalara 2 Collections: ‘మత్తు వదలరా 2’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింహా కోడూరి (Sri Simha) . అయితే ఆ తర్వాత.. ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అతను అందుకోలేదు. రితేష్ రానా (Ritesh Rana) డైరెక్ట్ చేసిన ఆ చిత్రంలో సత్య (Satya) కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇక దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)  రూపొందింది.

Mathu Vadalara 2 Collections

సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి.2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 3వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి (Mathu Vadalara 2) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.17 cr
సీడెడ్ 0.59 cr
ఆంధ్ర(టోటల్) 1.42 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.48 cr
 ఓవర్సీస్ 2.45 cr
వరల్డ్ వైడ్(టోటల్) 7.11 cr

‘మత్తు వదలరా 2’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా …. వీకెండ్ ముగిసేసరికి రూ.7.11 కోట్ల షేర్ ను రాబట్టి అదరగొట్టింది. ఇప్పటివరకు ‘మత్తు వదలరా 2’ రూ.3.11 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేసింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

వైరల్ అవుతున్న సిద్దార్థ్ అదితిరావుల పెళ్లి ఫోటోలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus