వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ మూవీ ‘మట్కా'(Matka) నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చింది.’పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి , కొద్దిపాటి అంచనాలు రేకెత్తించాయి. కానీ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. డైలాగ్స్ కూడా ప్లేస్మెంట్ కి సెట్ అవ్వలేదు.. కథనం చాలా వీక్ గా ఉంది అంటూ అంతా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు.
వీకెండ్ ను ఈ సినిమా ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. మొదటి సోమవారం చాలా చోట్ల వాషౌట్ అయిపోయింది అని చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.36 cr |
సీడెడ్ | 0.12 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.07 cr |
కృష్ణా | 0.13 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.16 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.29 cr |
‘మట్కా’ చిత్రానికి రూ.14.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ సినిమాకి జీరో షేర్ ఉండటం ఘోరమైన విషయం.