టాలీవుడ్ ఇండస్ట్రీలో మే నెలకు ప్రత్యేక స్థానం ఉంది. మే నెలలో విడుదలై హిట్టైన సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలను మే నెలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మే నెలలో రిలీజ్ చేయడం వల్ల సమ్మర్ హాలిడేస్ ను సినిమాలు క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల ఈ ఏడాది మే నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కాలేదు.
గత నెలలో విడుదల కావాల్సిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) వేర్వేరు కారణాల వల్ల ఈ నెల 27వ తేదీకి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. మే నెలలో మొత్తం అటూఇటుగా 25 సినిమాలు విడుదలైతే ఈ సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మిగతా సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయనే చెప్పాలి. మే ఫస్ట్ వీక్ లో ఆ ఒక్కటి అడక్కు, బాక్ సినిమాలు రిలీజయ్యాయి.
ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేక ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రసన్నవదనం (Prasanna Vadanam), శబరి సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రెండో వారంలో ప్రతినిధి2 (Prathinidhi 2), కృష్ణమ్మ (Krishnamma) రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఆరంభం, లక్ష్మీ కటాక్షం, బ్రహ్మచారి సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు సైతం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం. మూడో వారంలో నటరత్నం, దర్శిని, మిరల్ రిలీజ్ కాగా అపరిచితుడు రీరిలీజ్ అయింది.
ఈ సినిమాలు సైతం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. నాలుగో వారంలో లవ్ మీ (Love Me), రాజు యాదవ్ (Raju Yadav) , సిల్క్ శారీ, సీడీ సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేదు. మే నెల చివరి వారంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari), భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) , గం గం గణేశ (Gam Gam Ganesha) రిలీజ్ కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భజే వాయువేగం సినిమాలకు అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లను బట్టి ఈ సినిమాల రిజల్ట్ గురించి క్లారిటీ రానుంది.