Mechanic Rocky First Review: విశ్వక్ సేన్ కి ఈసారి హిట్టు దక్కుతుందా?

[Click Here For Full Review]

 

మాస్ క దాస్ విశ్వక్ సేన్  (Vishwak Sen)  నుండి ఈ ఏడాది ‘గామి’ (Gaami) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) వంటి సినిమాలు వచ్చాయి. అవి రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించాయి. ఇప్పుడు మూడో సినిమాగా ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) వస్తుంది. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) , శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) ..లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నరేష్, సునీల్ (Sunil)..లు కీలక పాత్ర పోషించారు. టీజర్, రెండు ట్రైలర్స్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేశారు.

Mechanic Rocky First Review

అవి పర్వాలేదు అనిపించాయి. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ఇక ఆల్రెడీ ఈ చిత్రాన్ని సినిమా పెద్దలకి చూపించారు మేకర్స్. పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఇక సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ సినిమా అని.. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది అని..! ఇంటర్వెల్ కి ఎమోషనల్ సీక్వెన్స్ తో ఎండ్ అవుతుంది అని..!

హీరో తన తండ్రిని అలాగే మెకానిక్ షెడ్డుని కోల్పోయిన తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనేది కథ అంటున్నారు. శ్రద్దా శ్రీనాథ్ రోల్ లో ఒక ట్విస్ట్ ఉంటుందట. ఇక మీనాక్షి చౌదరి గ్లామర్ తో మెప్పిస్తుందని చెబుతున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయ్యాయట. యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ పంచులు బాగా పేలాయి అని అంటున్నారు. మొత్తంగా ‘మెకానిక్ రాకీ’ ఒక మంచి మూవీ అనే టాక్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయట. మరి ప్రీమియర్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

మూడు విదేశీ భాషల్లోనూ దేవర.. నెట్‌ఫ్లిక్స్‌ స్టెప్‌ అదిరిందిగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus