సైమా(SIIMA – South Indian International Movie Awards) అవార్డులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2012 నుండి ఈ అవార్డుల వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో సూపర్ హిట్ అయిన, అలాగే క్రిటిక్స్ ని మెప్పించిన సినిమాలు.. అలాగే వాటికి పని చేసిన ఫిలిం మేకర్స్ ను సత్కరిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.
తాజాగా ‘సైమా 2025’ అవార్డుల వేడుకను దుబాయ్ లో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో స్టార్స్ అంతా తమదైన శైలిలో సందడి చేశారు. ఇలాంటి వేడుకల్లో హీరోయిన్ల హడావిడి హైలెట్ అవుతూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రష్మిక వంటి స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఈ వేడుకల్లో సందడి చేశారు. కానీ అందరికంటే స్పెషల్ గా నిలిచింది మీనాక్షి చౌదరి అనే చెప్పాలి.
‘లక్కీ భాస్కర్’ సినిమాలోని ఆమె పోషించిన పాత్రకు గాను క్రిటిక్స్ అవార్డు పొందింది మీనాక్షి చౌదరి. ఈ అవార్డు అందుకోవడానికి ఆమె చాలా స్పెషల్ గా రెడీ అయ్యి వచ్చింది. రెడ్ కార్పెట్ పై ఆమె వయ్యారంగా నడిచి వచ్చిన తీరు గ్లామర్ ప్రియులను ఆకట్టుకునే విధంగా విధంగా ఉంది. ఈమె ధరించిన డ్రెస్ కూడా ఆకర్షించే విధంగా ఉంది. వైట్ కలర్ డిజైనర్ బాడీ కాన్ గౌన్లో.. క్లీవేజ్ అందాలు వడ్డిస్తూ మీనాక్షి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. మీనాక్షి దాదాపు 5 అడుగుల 10 అంగుళాల హైట్ ఉంటుంది కాబట్టి.. ఆమె ధరించిన డ్రెస్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ ఈవెంట్లో మీనాక్షికి సంబంధించిన పిక్స్,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.