సుశాంత్ (Sushanth) హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ఆ తర్వాత రవితేజ (Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) , అడివి శేష్ (Adivi Sesh) ‘హిట్ 2’ (HIT: The Second Case) , మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాల్లో నటించింది. ‘హిట్ 2’ మంచి సక్సెస్ సాధించి.. మీనాక్షికి తొలి హిట్ ను కట్టబెట్టింది.ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ ఛాన్సులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ తో (Vijay Thalapathy) చేసిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time )(గోట్) అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.
అయితే అక్టోబర్ 31 నుండి మీనాక్షి సినిమాలు వారానికి ఒకటి చొప్పున విడుదల కానున్నాయి. ఆమె స్టార్ హీరోయిన్ ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్న టైం ఇది. ముందుగా అక్టోబర్ 31 న ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) విడుదల కాబోతుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో. కచ్చితంగా ఈ సినిమా హిట్టు కొట్టేలా కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే నవంబర్ 14 న ‘మట్కా'(Matka) విడుదల కానుంది.
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ఈ సినిమాకి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకుడు. దీనిపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. మీనాక్షి రోల్ బాగా వచ్చింది అని వినికిడి. మరోపక్క నవంబర్ 22న మీనాక్షి నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా మీనాక్షి స్పెషల్ అట్రాక్షన్. దీనిపై మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ఉంది. సో ఈ 3 సినిమాలు నిలబడితే మీనాక్షి స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని చెప్పొచ్చు.