Meenakshi, Balakrishna: బాలయ్య- బాబీ.. సినిమాలో ఆ యంగ్ హీరోయిన్..నిజమేనా?

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఒకటి ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల వచ్చిన ‘భగవంత్ కేసరి’ కూడా సూపర్ హిట్ అయ్యింది. అన్ని ఏరియాల్లోని బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ను అందించి.. అలాగే కొత్త బాలయ్యని ప్రేక్షకులకు పరిచయం చేసింది అని చెప్పాలి. వీటికి ముందు చేసిన ‘అఖండ ‘ కూడా బ్లాక్ బస్టరే..!

ఇలా హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపులో ఉన్న (Balakrishna) బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాని స్టార్ డైరెక్టర్ బాబీతో చేయబోతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథ ప్రకారం.. మరో యంగ్ హీరోకి కూడా ఛాన్స్ ఉంటుంది అని చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం నాని, దుల్కర్..లను సంప్రదించగా దుల్కర్ ఫైనల్ అయినట్టు కూడా టాక్ వినిపించింది.

ఇక హీరోయిన్ గా ఎవరు? అనే ప్రశ్న కూడా అందరిలోనూ ఉంది. వాస్తవానికి హీరోయిన్ ఎంపిక జరగకుండానే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇటీవల ఓ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. ఈ సినిమా కథ ప్రకారం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే హీరోయిన్ అవసరం ఉంటుందట. ఆ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని అనుకుంటున్నట్టు వినికిడి. అయితే బాలయ్య సరసన మీనాక్షి సూట్ అవుతుందా? కాదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈమెను నిజంగా ఫిక్స్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus