మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా, రియాలిటీ షోలకు జడ్జిగా జనసేన నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆరెంజ్ సినిమా నిర్మాతగా భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో నాగబాబు సినీ నిర్మాణానికి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. నాగబాబు నిర్మాతగా రీఎంట్రీ ఇస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే నాగబాబు ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
జబర్దస్త్ షోతో పాటు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం వల్ల నాగబాబు ఆస్తుల విలువ గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. మార్కెట్ విలువ ప్రకారం నాగబాబు ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని బోగట్టా. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఈ ఏడాది విడుదలైన గని సినిమా వరుణ్ తేజ్ కు భారీ షాకివ్వగా ఎఫ్3 సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. నాగబాబు ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సర్కారు వారి పాట సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఇతర స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లకు ఓకే చెబుతూ నాగబాబు సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాగబాబు రెమ్యునరేషన్ రోజుకు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని బోగట్టా.
సినిమాసినిమాకు నటుడిగా నాగబాబు రేంజ్ పెరుగుతోంది. హీరోల, హీరోయిన్ల తండ్రి పాత్రలలో నాగబాబు ఎక్కువగా నటిస్తున్నారు. మెగా హీరోలపై ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శల గురించి కౌంటర్ ఇచ్చే విషయంలో నాగబాబు ముందువరసలో ఉంటారు. ఆరు పదుల వయస్సులో కూడా నాగబాబు ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. నాగబాబు మరెన్నో విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.