పిక్‌ టాక్‌: ఫుల్‌ ఫ్రేమ్‌ అంటే ఇదీ… ఎంత కనులపండువగా ఉందో?

మెగా, అల్లు హీరోల మధ్య అంతా ఓకేనా? చాలా రోజుల నుండి ఈ ప్రశ్న వస్తూనే ఉంది. అంతా ఓకే అనుకునేటప్పుడు సడన్‌గా ఏదో ఒక న్యూసో, పుకారో బయటకు వస్తుంటుంది. దీంతో మెగా – అల్లు ఫ్యాన్ వార్స్‌ షురూ అవుతూ వస్తున్నాయి. అయితే వాళ్లు ఓ విషయం మరచిపోతున్నారు. అదే ‘మెగా X అల్లు’ కాదు, ‘మెగా అండ్‌ అల్లు’ అని. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ మెగా ఫ్యామిలీ మొత్తం మరోసారి అసెంబెల్‌ అయ్యింది.

ఇది క్రిస్మస్‌ సీజన్‌ కాబట్టి వాళ్లందరూ కలసింది క్రిస్మస్‌ సెలబ్రేషన్ల కోసమే అని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ యూత్‌ అంతా దిగిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసి నిజమైన మెగా – అల్లు ఫ్యాన్స్‌ సంబరపడిపోతుంటే… ఫ్యాన్స్‌ అని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు అందులో లొసుగులు వెతకడం మొదలుపెట్టారు.

బన్నీ, చరణ్‌ పక్కపక్కనే ఉండి మేమంతా ఒక్కటే అని కావాలనే చెప్పారు అంటూ ఏవేవో అంటున్నారు. నిజానికి బన్నీ, చెర్రీ సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యామిలీ పార్టీల్లో కలసి కనిపిస్తుంటారు. జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. క్రిస్మస్ వేడుకల్లో మెగా హీరోలంతా పై ఫొటోలో సరదాగా కనిపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు మొత్తం (Mega Family ) మెగా హీరోలు, ఇంటి అమ్మాయిలు, కోడళ్లు ఈ ఫొటోలో కనిపిస్తారు.

చరణ్‌, బన్నీ ఫ్యాన్స్‌ అయితే… బావాబామ్మర్దులు అలా పక్కపక్కన నిల్చోవడం, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పోజులు ఇవ్వడం చూసి ఫిదా అయిపోతున్నారు. దీపావళి, సంక్రాంతికి కూడా ఇలా వీళ్లంతా కలుస్తారు అనే విషయం తెలిసిందే. ఈ పిక్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక, అల్లు బాబీ, లావణ్య, స్నేహా రెడ్డి, ఉపాసన తదితరులు కనిపిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus