Koratala Siva: లొల్లికి దారి తీసిన కొరటాల కామెంట్స్‌.. ‘దేవర’ రాని చూద్దాం అంటూ.!

‘ఆచార్య’  (Acharya) సినిమా ఫలితం కంటే.. ఆ తర్వాత జరిగిన చర్చలు, ఉపచర్చలే ఎక్కువ ఇబ్బంది పెట్టాయి. ఇటు ప్రేక్షకులు, అటు దర్శకుడు, ఇంకోవైపు చిరంజీవి (Chiranjeevi)   – రామ్‌చరణ్‌కు (Ram Charan) పెద్ద సమస్యే అయ్యింది. ఎవరు చేశారు? ఏం అన్నారు? అనేది ఇక్కడ అప్రస్తుతం. అయితే ఆ కారణమో, లేక ఇంకేదైనా ఉందో తెలియదు కానీ.. కొరటాల (Koratala Siva) ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్‌ మళ్లీ పెద్ద చర్చకు దారి తీశాయి. తొలుత జరిగిన పంచాయితీ చూస్తే.. ‘ఆచార్య’ సినిమా ఫలితానికి కారణం దర్శకుడిదే అని కొందరు అనగా..

Koratala Siva

కాదు కాదు ఆయన పనిలో చిరంజీవి, రామ్‌చరణ్‌ చేతులు పెట్టడం వల్లే అలా జరిగింది అంటూ మరికొంతమంది కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ‘దేవర’ (Devara) సినిమా కోసం ప్రచారానికి దిగిన కొరటాల శివ ‘ఎవరి పని వారు చేయకుండా వేరే వాళ్ల పనిలో చేయి పెట్టి..’ అంటూ కొన్ని కామెంట్స్‌ చేశారు. “నా పనికి నేను జవాబుదారీ. ఆ భయం నాకు ఉంది. ఎవడిపని వాడు చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది.

పక్కోడి పనిలో చేయి దూర్చి, ఆయన్ను ఇబ్బంది పెట్టి, మనం కూడా పూర్తిచేయకుండా వదిలేస్తే అది పెద్ద ఇబ్బంది’’ అని కొరటాల అన్నారు. కొరటాల చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపాయి అని చెప్పాలి. ‘ఆచార్య’ సినిమా ఫలితంతో ఇప్పటికే డౌన్‌లో ఉన్న మెగా ఫ్యాన్స్‌ ఇప్పుడు కొరటాల కామెంట్స్‌ విని ఇంకా కోపమవుతున్నారు. నిజానికి చిరంజీవి గతంలో ఓ సినిమా వేదిక మీద దర్శకుడు తన పని తను చేయకుండా నిర్మాణ వ్యవహారాల్లో తలదూర్చకూడదు అని సూచనలు చేశారు.

అది కొరటాల కోసమే అని అప్పుడు చర్చలు జరిగాయి. ఇప్పుడు కొరటాల మాటలు చిరంజీవి గురించే అని చెప్పేస్తున్నారు నెటిజన్లు. దీంతో అప్పుడు ఏం జరిగిందో జరిగింది.. తప్పొప్పులు ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్‌ చేయక్కర్లేదు. ‘దేవర’ సినిమా పరిస్థితి చూశాక మాట్లాడదాం అని కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో సెప్టెంబరు 27న క్లారిటీ వచ్చేస్తుంది.

ఆరేళ్ల తర్వాత సోలో రిలీజ్ కి ఇంత చెత్త ప్లానింగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus