DSP: వాల్తేరు వీరయ్యతో ఆ నమ్మకం నిజమవుతుందా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ట్రాక్ తప్పారు. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తే సినిమాకు ఆ మ్యూజిక్ కచ్చితంగా ప్లస్ అయ్యేది. అయితే ఇప్పుడు మాత్రం మ్యూజిక్ మైనస్ అవుతుండటం గమనార్హం. ఉప్పెన, పుష్ప ది రైజ్ మినహా ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

దేవిశ్రీ ప్రసాద్ క్రమంగా ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మనసు పెట్టి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు ఆయన ఇస్తున్న మ్యూజిక్ క్వాలిటీకి పొంతన లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు థమన్ సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతుంటే మరోవైపు దేవిశ్రీ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతోంది. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంటున్నారు.

ఒకప్పుడు తన పాటలతో సంచలనాలు సృష్టించిన దేవిశ్రీ ప్రసాద్ వరుస సినిమాలతో నిరాశ పరుస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అయినా దేవిశ్రీ ప్రసాద్ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఫస్ట్ సింగిల్ తోనే దేవిశ్రీ ప్రసాద్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో క్లారిటీ రానుంది. ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ మరింత పెరుగుతుందో లేక తగ్గుతుందో చూడాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు సైతం భారీగా తగ్గాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus