Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో బాధపడుతున్న మెగా ఫ్యాన్స్.. ఏమైందంటే?

మెగా అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దర్శకుడు శంకర్ (Shankar)  3 ఏళ్ళ పాటు ఈ చిత్రాన్ని చెక్కుతూ వచ్చాడు. ఫైనల్ గా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి రోజు మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. నిర్మాత దిల్ రాజుకి  (Dil Raju)  భారీ నష్టాలూ తప్పలేదు. అన్నీ ఎలా ఉన్నా..

Vishwambhara

‘గేమ్ ఛేంజర్’ తో మెగా అభిమానులను చాలా ఆడుకున్నాడు దర్శకుడు శంకర్. ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఏడాది పాటు వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టాడు. పాటలు కూడా వాళ్ళని ఆకట్టుకోలేదు. ఇక సినిమా సంగతి తెలిసిందే. 1999 లో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ కి స్పూఫ్ లా ‘గేమ్ ఛేంజర్’ ఉంది అనే విమర్శలు వచ్చాయి తప్ప.. రాంచరణ్  (Ram Charan)  పాత్రకి వచ్చిన ప్రశంసలను ఎవ్వరూ గుర్తించలేదు.

ఏదేమైనా ‘గేమ్ ఛేంజర్’ మెగా అభిమానులని పూర్తిగా నిరాశపరిచిన సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) ని సంక్రాంతి బరి నుండి తప్పించారు. కనీసం ఆ సినిమా వచ్చినా బాగుండేది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ‘విశ్వంభర’ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 మంది అక్కాచెల్లెళ్లకి సోదరుడిగా చిరు నటించారు. పైగా ఫాంటసీ జోనర్ కూడా. కాబట్టి.. గతేడాది ‘హనుమాన్’ (Hanuman) మాదిరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చేది అనేది మెగా అభిమానుల అభిప్రాయం.

కొంతవరకు నిజమే.. కానీ ‘విశ్వంభర’ వాయిదా పాడటానికి ‘గేమ్ ఛేంజర్’ ఒక్కటే కారణం కాదు. వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్లో పడింది. అలాగే ఓటీటీ డీల్ కూడా ఫినిష్ అవ్వలేదు. ఈ కారణాలు కూడా ఆ సినిమాని సంక్రాంతి బరి నుండి తప్పుకునేలా చేశాయి. వేసవిలో ఆ సినిమా రిలీజ్ అవ్వచ్చు. అది కూడా మంచి సీజనే. కానీ సంక్రాంతికి వచ్చి ఉంటే.. మెగా అభిమానులకు ఆనందాన్ని మిగిల్చి ఉండేది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus