Peddha Kapu: పెదకాపు సినిమా ఫస్ట్ ఛాయిస్ ఆ మెగా హీరోనేనా?

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెదకాపు. విరాట్ కర్ణ అనే కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరాతి ఘోరంగా డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఈ సినిమా విడుదలైన తర్వాత వరుసగా సెలవులు వచ్చినప్పటికీ ఈ సినిమా కనీసం 50 లక్షల గ్రాస్ కలెక్షన్స్ కూడా రాబట్ట లేకపోయింది అంటే ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో మనకు తెలుస్తోంది. ఇండస్ట్రీ ఆల్మోస్ట్ శ్రీకాంత్ అడ్డాలను మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈయన పెదకాపు సినిమాని ప్రకటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కూడా సినిమాపై భారీగానే అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాతో ఈయన తప్పకుండా సక్సెస్ అందుకుంటారని అందరూ భావించారు.

ఇక ఈ సినిమా (Peddha Kapu) విడుదలైన తర్వాత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ కొత్త హీరో విరాట్ కర్ణ కాదట సాయి ధరమ్ తేజ్ అనే విషయం తెలియడంతో మెగా ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీకాంత్ అడ్డాల ఈ కథ సాయి ధరంతేజ్ కి చెప్పగా కథ విన్నటువంటి సాయి ధరంతేజ్ ఆయనకు నచ్చినప్పటికీ ఎక్కడో ఏదో తేడా కొడుతుందన్న ఉద్దేశంతో ఈ కథను కొద్దిరోజుల పాటు అలాగే పెట్టండి తప్పకుండా చేద్దామని చెప్పారట అయితే అంతవరకు ఆగలేకపోయినటువంటి ఈయన కొత్త హీరోతో ఈ సినిమాని చేశారు. అలా ఈ సినిమాలో నటించాల్సిన సాయి ధరంతేజ్ కాస్త తప్పించుకున్నారని లేకపోతే భారీ డిజాస్టర్ ఎదుర్కొని పూర్తిగా సాయి ధరంతేజ్ కెరియర్ ముగిసిపోయే పరిస్థితులు కూడా వచ్చేవి అంటూ మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus