ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమాని రీమేక్ చేసే పద్దతిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం’ ను ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఓ వారం పాటు ఇక్కడ ఆడింది. అటు తర్వాత ‘జీ తెలుగు’ ఛానల్ లో ఈ మూవీని చాలా సార్లు టెలికాస్ట్ చేశారు. అయినప్పటికీ ‘కాటంరాయుడు’ పేరుతో ఈ మూవీని తెలుగులోకి రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్-డాలి. పవన్ పేరు చెప్పుకుని ఈ మూవీకి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ..
ఆశించిన ఫలితాన్ని ఈ మూవీ ఇవ్వలేదు. అటు తర్వాత ‘జిగర్తాండ’ మూవీని కూడా ‘చిక్కడు దొరకడు’ గా తెలుగులోకి డబ్ చేస్తే.. దానిని కూడా ‘గద్దలకొండ గణేష్’ పేరుతో వరుణ్ తేజ్- హరీష్ శంకర్ లు రీమేక్ చేశారు. అయితే ఇందులో చాలా మార్పులు చేశారు లెండి. ఇప్పుడు ‘లూసీఫర్’ చిత్రాన్ని ‘గాడ్ ఫాథర్’ గా రీమేక్ చేస్తున్నారు చిరు. ఇది కూడా తెలుగులో డబ్ అయిన మూవీనే..! మరోపక్క ఆయన ‘ఎన్నై ఆరిందాల్’ ను కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా ‘ఎంత వాడవు గాని’ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
ఇప్పుడు మరో చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి మెగా ఫ్యామిలీ దృష్టి పెట్టింది. అది కూడా డబ్ అయిన సినిమానే. అజిత్ నటించిన ‘విశ్వాసం’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారట. చిరునే ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? లేక పవన్ చేస్తారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ‘విశ్వాసం’.. ‘స్టార్ మా’ లో చాలా సార్లు టెలికాస్ట్ అయిన మూవీనే..! పైగా చిరు నటించిన ‘డాడీ’ వెంకటేష్ నటించిన ‘తులసి’ చిత్రాల స్పూర్తితో ఇది రూపొందింది. మరి దీనిని మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేయడం ఏంటో..!
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!