మెగా డ్రీమ్.. మణిరత్నం ఫ్రేమ్!

తిరుపతి వెంకన్న లడ్డుని ఇష్టపడని భక్తుడు ఉండడన్నది ఎంత నిజమో, మణిరత్నం ఫ్రేమ్ లో ఒక్కసారైనా కనపడాలి అనుకోని నటుడుండన్నదీ అంతే నిజం. అయితే తెలుగు వారికి ఇది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ‘గీతాంజలి’ ద్వారా దాన్ని అందుకున్న ఏకైక తెలుగు నటుడు నాగార్జున మాత్రమే. ఇప్పటికీ ఆ అవకాశం రాకపోతుందా అని నాని లాంటి వారంతా ఎదురుచూస్తున్నారు. వారిలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

అప్పట్లో మణిరత్నం – రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశారని వార్తలొచ్చాయి. ఆపై సతీ సమేతంగా మణిరత్నం చిరు ఇంట దర్శనమిచ్చేసరికి ఇహ సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కార్తీ హీరోగా ఓ సినిమా చేస్తోన్న మణిరత్నం మళ్ళీ రామ్ చరణ్ సినిమా గురించి ఆలోచన చేస్తున్నారట. తెలియవస్తున్న మరో విషయం ఏమిటంటే ఇందులో అల్లు అర్జున్ కూడా నటించనున్నాడట. అదే జరిగితే ఇదో సెన్షేషన్ కాంబినేషన్ అవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మణిరత్నం సినిమా అంటే ఎవరు నో చెప్పే అవకాశం లేదు. ఈ కథలో తర్వాతి మలుపు ఎక్కడుందో మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus