Chiranjeevi, Nagarjuna: ‘నాగార్జున 100 ‘ కోసం అనుకున్న కథ చిరు వద్దకి వెళ్లిందా?

20 ఏళ్ళ తర్వాత ‘గాడ్ ఫాదర్’ (God Father) చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja).. రీ ఎంట్రీలో కూడా తన డైరెక్షన్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించకపోయినా మోహన్ రాజా డైరెక్షన్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఎలాంటి కథనైనా అతను ఓన్ చేసుకుని తెరపై ఆవిష్కరించే విధానం సూపర్. అయితే ‘గాడ్ ఫాదర్’ తర్వాత నాగార్జునతో (Nagarjuna) ఓ సినిమాని ప్లాన్ చేశాడు మోహన్ రాజా.

నాగార్జునకి కథ నచ్చింది. కథ ప్రకారం ఇంకో హీరోకి ఛాన్స్ ఉంది కాబట్టి.. అఖిల్ ని (Akhil) కూడా ఇరికిద్దాం అనుకున్నారు. నాగార్జున 99 లేదా 100 వ ప్రాజెక్టుల్లో ఒకటి ఇది అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో నాగ్ సంతృప్తి చెందలేదు. మోహన్ రాజాని హోల్డ్ లో పెడుతూ వచ్చాడు. ఇన్నాళ్లు వెయిట్ చేయించి.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయలేను అని మోహన్ రాజాకి నాగార్జున చెప్పినట్లు తెలుస్తుంది.

దీంతో చిరుని (Chiranjeevi) అప్రోచ్ అయ్యాడు మోహన్ రాజా. అదే కథ చిరుకి చెప్పి.. కొన్ని మార్పులతో స్క్రిప్ట్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో ఇంకో హీరోకి ఛాన్స్ ఉంది కాబట్టి.. వరుణ్ (Varun Tej) , వైష్ణవ్ (Panja Vaisshnav Tej) , సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej)  ..లలో ఒకరు ఈ ప్రాజెక్టులో భాగం అవ్వొచ్చు అని ఇన్సైడ్ టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus