చిరంజీవి గారు అలా చెప్పడంతో షాకయ్యను..!

నిఖిల్ హీరోగా టి.ఎన్. సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ టీజర్ కి 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. యాక్షన్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో ఈ టీజర్ ను కట్ చేసారు. పలువురు ప్రముఖులు ఈ చిత్ర టీజర్ ని చూసిన తరువాత నిర్మాత రాజ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ లు చేశారట. ఈ లిస్ట్ లో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారట.

‘అర్జున్ సురవరం’ టీజర్ ని చూసిన తరువాత చిరంజీవి కూడా మెసేజ్ ద్వారా తన అనుభూతిని తెలియజేసారు. ఈ విషయాన్నినిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. నిఖిల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ..”ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసిన తరువాత మా నిర్మాత రాజ్ కుమార్, ఒక మెసేజ్ ను మాత్రం ఆయన అదే పనిగా చూస్తూ మురిసిపోతున్నాడు. ఆ మెసేజ్ ను ఎవరు పంపించి ఉంటారా అని ఆయన నుంచి ఫోన్ లాక్కుని చూశాను .. అది మెగాస్టార్ పంపించిన మెసేజ్ .. అంతే షాక్ అయ్యాను. ఆ మెసేజ్ లో మెగాస్టార్ చిరంజీవిగారు మాట్లాడుతూ…’అర్జున్ సురవరం’ టీజర్ చూశాను .. చాలా ఆసక్తికరంగా వుంది. మీకు .. దర్శకుడికి .. నిఖిల్ కి ఆల్ ది బెస్ట్’ అంటూ ఆయన మెసేజ్ చేశారు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు” అంటూ సంతోషం వ్యక్తం చేసాడు నిఖిల్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus