Chiranjeevi: మొదటిసారి ఆ కష్టాన్ని చూస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒకేసారి ఎక్కువ సెట్స్ మధ్య గారడీ చేస్తున్నారు. మెగాస్టార్ తన కెరీర్‌లో ఏకకాలంలో ఎన్నో సినిమాలు చేసాడు కానీ ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడూ ఒకేసారి మూడు సినిమాల మధ్యలో బిజీ అవ్వలేదు. ఈ నటుడు గత రెండు నెలలుగా గాడ్ ఫాదర్ షూటింగ్‌లో ఉన్నాడు. ఇక ఈ రోజు భోళా శంకర్ షూటింగ్‌ను ప్రారంభించాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈరోజు ఉదయం ప్రారంభమైన షూటింగ్ ఈ నెలాఖరు వరకు జరగనుంది. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తమన్నా చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. కీర్తి సురేష్ అతని సోదరిగా నటిస్తోంది.ఇక డిసెంబర్‌లో బాబీ సినిమా షూటింగ్‌ను కూడా చిరంజీవి ప్రారంభించనున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. త్వరలోనే మెగాస్టార్ గాడ్ ఫాదర్ ను కూడా సెట్స్‌ పైకి తెనున్నాడు.

ఇక పెండింగ్ భాగాలను పూర్తి చేయనున్నాడు. చిరంజీవి ఆచార్య షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు మరియు కాజల్ కథానాయిక. రామ్ చరణ్, పూజా హెగ్డే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus