ఏ విషయాన్ని అయినా ఒకటికి పది సార్లు ఆలోచించి వ్యవహరిస్తూ ఉంటారు మన మెగాస్టార్ చిరంజీవి. సినిమాల పట్ల ఆయన ఎంత డెడికేషన్ తో ముందుకు సాగుతారో.. నిజ జీవితంలో కూడా అంతే డెడికేషన్ తో ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఎవ్వరినీ ఊరికే డబ్బులు ఖర్చు చెయ్యనివ్వరు మెగాస్టార్. ఈ మాట ఆయనతో పనిచేసిన ఎంతో మంది దర్శకనిర్మాతలు చాలా సార్లు చెప్పారు.
ఆయన ఏం చేసినా ఓ మర్యాద పూర్వకంగానే చేస్తుంటారు. అంతేకాదు స్నేహానికి కూడా ఎంతో విలువలు ఇచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లో నటులు సుధాకర్, హరిప్రసాద్ లతో ఈయనకు మంచి స్నేహం ఉండేది. వాళ్లను నిర్మాతలుగా నిలబెట్టడం కోసం ‘దేవాంతకుడు’ అలాగే ‘యముడికి మొగుడు’ చిత్రాలను చేశారు మెగాస్టార్. ‘దేవాంతకుడు’ అంతంత మాత్రం ఆడినా.. ‘యముడికి మొగుడు’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
తన స్నేహితులిద్దరికీ మంచి నిర్మాతలు అనే పేరొచ్చింది.పైన మనం చూస్తున్న ఫోటో కూడా ‘యముడికి మొగుడు’ చిత్రం షూటింగ్ స్పాట్ లోనిదే..! ఆ చిత్రం వందరోజుల వేడుకను నిర్వహించి.. ఆ ఏడాది ఆత్మహత్య చేసుకొన్న పత్తి రైతుల కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు చిరంజీవి అండ్ ఫ్రెండ్స్. ఈ రకంగా వారి గొప్ప మనసును చాటుకోవడం విశేషం.